Wednesday, February 6, 2008

నరకానికి నెత్తురుమెట్లు

నరకానికి నెత్తురుమెట్లు


"టపటపా రెక్కల చప్పుడుతో
ఎగరలేక ఎగురుతూ
పచ్చికొమ్మపై వచ్చి వాలిందొక కపొతం
దాని కంటినుంచి కారుతుంది రక్తం"


"పక్కకొమ్మపైనుంచి చూచిన కాకి

కపోతం ను నెమ్మదిగా సాకి
నీవు శాంతికి చిహ్నం
నిన్ను చూస్తే నాకుకలుగుతోంది అసహ్నం
నాకు తెలపాలి దీనికి కారణం"

"కపోతం చెప్పసాగింది తనబాగోతం"
"చేతిలో నన్ను చంపినంత పనిచేసాడు
శాంతి కోసమే తానన్నడు"

"ఆకశంలో హాయిగా విహరిస్తూ
పచ్చని చెట్లను పలుకరిస్తూ
ఆనందంగా జీవిస్తూ
ప్రశాంతంగా బ్రతుకు సాగిస్తున్నా"

"ప్రశాంతానికి ప్రతిరూపం అన్నారు
శాంతి చిహ్నమే నీవన్నారు
వీరేమో కులమతాలతో కొట్టుకున్నరు"
"ప్రజలు ఇచ్చిన గౌరవానికి పొంగి పోయాను
నన్ను ఎంచిన తీరుకి మురిసి పోయను
కాని వారి విభేదాలు చూసి విస్తుపోయాను"


"స్వాతంత్ర దినమో
గణతంత్ర దినమో
నాకైతే అదే తద్దినం "

"స్వేచ్చగా ఎగురుతున్న నన్ను
వలవేసి
వడిసి పట్టారు"
"రాజకీయ రొంపితో
కానరాని రక్తపు మరకలతో
ఉన్న నాయకుని చేతిలో పెట్టారు"

"ఆయన ఉపన్యాసంతో ఊగిపోయాడు
చేతిలో నన్ను పూర్తిగా నలిపాడు"
"నాగొంతు నులుముతున్నయి అతని వేళ్ళు
ఉపన్యాసంలో వున్న అతనికి తెలియటం లేదు వళ్ళు"

"గాలిలోకి విసిరాడు నన్ను
అప్పటికే పోయింది నాకో కన్ను"

"ప్రజలంతా కొడుతున్నారు చప్పట్లు

ఎవరూ గమనించ లేదు నా అగపాట్లు
వారు అనుసరిస్తే ఆ నాయకుని మాటలు
అవే వారికి నరకానికి నెత్తురుమెట్లు"

గోష

గోష


"అందని అందాలు అందుకోవాలని
ఎంతో ఆత్రంగా ఉన్న నా మనస్సుని
హద్దు మీరకుండా ఆపుకొని
ముందుగా నీ అనుమతి తీసుకోవాలని
ఆ ఇంగితం నాకుందికాని
అర్దం చేసుకో నాహ్రుదయ గోషని"
:-వర్మ